Tuesday, August 26, 2014

గణనాధుడు లోకనాయకుడు


  • ముంబైలోని లాల్ భాగ్ గణపతి మండపాన్ని ఏట కోటి యాభై లక్షల మందికి పైగా భక్తులు సందర్శిస్తారు.
  • రెండు చేతులే ఉండే గణపతి విగ్రహం ఎక్కువగా కనిపించదు. అలాంటి విగ్రహాలు ఉండకూడదని భక్తుల విశ్వాసం.
  • ఇండోనేషియా, గ్రీస్ దేశాల కరెన్సీ పైన వినాయకుడి బొమ్మను ముద్రిస్తారు. ఎనిమిది దేశాలు గణపతి పోస్టల్ స్టాంపులనూ విడుదల చేసాయి.
  • ముద్గల పురాణం ప్రకారం గణపతి ఎనిమిది రూపాల్లో అవతరించాడు. అందులో ఐదు అవతారాలకు మూషికమే వాహనమైనా, మిగతా వాటికి పాము, సింహం, నెమలి వాహనాలుగా వున్నాయి.
  • తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న గణపతి దేవాలయమే దేశంలో అత్యంత ప్రాచీనమైనదని చెబుతారు. రామాయణ కాలంలోనే దీని ప్రస్తావన ఉందనీ, మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన కొండపైన దీన్ని నిర్మించారని చరిత్రకారులు అంటారు.
  • తమిళనాడులోని నాగర్ కోయిల్ మండలంలో ఉన్న గణపతి దేవాలయంలోని విగ్రహం ఆర్నెల్లు తెల్లగా మరో ఆర్నెల్లు నల్లగా మారుతుంది.
  • దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీ రూపంలో ఉన్న గణపతిని వినాయకి, గణేశని అంటూ రకరకాల పేర్లతో పూజిస్తారు. వినాయకిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు.
  • జపాన్ లో 250 వరకూ వినాయకుడి ఆలయాలున్నాయి. ప్యారిస్ లో గణపతి కొలువైన రధాన్ని వేలాది మంది భక్తులు లాగుతూ వీధుల గుండా ఊరేగించడం ఎప్పట్నుంచో సంప్రదాయంగా వస్తోంది.
* ఈనాడు వారపత్రిక నుండి సేకరించబడింది*
- సాయి నాధ్ రెడ్డి.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers