Monday, August 18, 2014

68 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మూడు రంగుల జెండాను భాగ్యనగర్ లో సైదాబాద్ వద్ద వున్న సింగరేణి కాలనీ లో వున్న మురికి బస్తీ ల పేద విద్యార్థులు సంతోషంగా ఎగరేసి జరుపుకున్నారు..2 కిలోమీటర్లు చిన్న పిల్లలందరూ దేశభక్తి నినాదాలిస్తూ నడిచారు..అక్షర విద్య పేరుతో ఏకలవ్య ఫౌండేషన్ వారిఆధ్వర్యంలో ఈ పేదబస్తీల్లో చదువులు చెపుతున్నారు.సంస్కార విలువలు నేర్పుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు,ఉద్యోగానికి రాజీనామా చేసి,సేవ చేస్తున్నవారు అలాగే పేద కళాశాల విద్యార్థులు ఈ చిన్న పిల్లలకు విద్య నేర్పిస్తున్నారు.ఈ ఫొటోలలో చూస్తున్నట్లుగా అన్ని మతాలు,అన్ని కులాలకు చెందిన పేద ప్రజల పిల్లలు భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తుంటే ఎవరి హృదయాలైనా ఉప్పొంగుతాయి.
ఇంకొక దృశ్యం ...బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ లో వాకర్స్ క్లబ్ వారు జెండా ఎగరేశారు.20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ క్లబ్ సభ్యులు 800 మందితో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఉచితంగా పుస్తకాలు పేద విద్యార్థులకు అందిస్తున్నారు..తులసి,అలెవోర,వేప,ఉసిరి మొదలైన మొక్కలు ఉచితంగా అందించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు.ఇందులో టాక్స్ కన్సల్టంట్స్,చార్టర్డ్ అకౌంటెంట్స్,కవులు,రచయితలు,సాఫ్ట్ ఇంజినీర్లు,రిటైర్డ్ ఉద్యోగులు వున్నారు.ఎక్కువ మంది సినియర్ సిటిజెన్లు వున్నారు..వీళ్ళంతా దేశభక్తి తో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవటం,రాజకీయ నాయకుల పటాటోపం లేకుండా మంచి సందేశాలిప్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers